మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్, మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మన టాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోలు పలు కారణాల చేత కొన్ని ప్రాజెక్టులను వదులుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. అలా రామ్ చరణ్ కి ఓ సినిమా ఉన్నట్టు తెలుస్తుంది.
మన టాలీవుడ్ విలక్షణ దర్శకుడు గత కొంత కాలం కితం రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేశారట. ఇందులో రామ్ చరణ్ మొత్తం మూడు విభిన్న పాత్రల్లో కనిపించే విధంగా ప్లాన్ చేసారట. కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. దీనితో ఈ సినిమా కానీ రామ్ చరణ్ చేసి ఉంటే ఖచ్చితంగా మరో మైల్ స్టోన్ లా నిలిచిపోయేది అని చరణ్ అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.