రామ్ మరియు రహీమ్ గా రామ్

ram-in-masala
ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత రెండు చిత్రాలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతూ ప్రేక్షకులను నిరాశపరిచింది. అప్పటినుండి సినిమాల ఎంపిక విషయంలో పలుజాగ్రత్తలు వహిస్తున్న ఈ జూనియర్ పవన్ ప్రస్తుతం ‘మసాలా’ విడుదలపై ఆసక్తి కనబరుస్తున్నాడు.

వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ఈ యువహీరోకు ఈ సినిమాలో రెండు పేర్లట. ఒకటి రామ్ మరొకటి రహీమ్. రామ్ పాత్ర మీసకట్టుతో రహీమ్ పాత్ర మీసం లేకుండా వుంటుందట. ఈ సినిమా ‘బోల్ బచ్చన్’ కు రీమేక్. ఇటీవలే సినిమా ఆడియో విడుదలైంది. విడుదల తేది ఖరారు కావాల్సివుంది.

అంజలి మరియు షాజాన్ పదాంసీ హీరోయిన్స్. విజయ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. సురేష్ బాబు, స్రవంతి రవికిషోర్ నిర్మాతలు.

Exit mobile version