ఈటీవీ విన్ ఒరిజినల్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ మన నేటివ్ కథ – సాయికృష్ణ

ఈటీవీ విన్ ఒరిజినల్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ మన నేటివ్ కథ – సాయికృష్ణ

Published on Nov 19, 2025 7:03 PM IST

ఈటీవీ విన్ సంస్థ నుంచి వస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం, మన చుట్టూ జరుగుతున్న వాస్తవ సంఘటనల కథలా అనిపిస్తుందని ఆ సంస్థ హెడ్ సాయికృష్ణ తెలిపారు. అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. వంశీ నందిపాటి, బన్నీ వాస్ లు తమ బ్యానర్‌ల ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సాధారణంగా ఓటీటీ కంటెంట్‌పై ఉండే అభిప్రాయాన్ని బ్రేక్ చేస్తూ, ఈటీవీ విన్ కుటుంబమంతా కలిసి చూసే సినిమాలు, సిరీస్‌లను అందిస్తోందని సాయికృష్ణ వివరించారు. ’90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’, ‘లిటిల్ హార్ట్స్’ వంటి విజయవంతమైన చిత్రాల పరంపరలో ఈ కొత్త ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పూర్వపు ఉషాకిరణ్ మూవీస్‌కు ఆధునిక విస్తరణగా తమ సంస్థను తీర్చిదిద్దుతున్నామని, మధ్యతరగతి ప్రజలకు కనెక్ట్ అయ్యే కథలకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం వరంగల్, ఖమ్మం జిల్లాల మధ్య జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు సాయిలు కంపాటి రూపొందించారు. దర్శకుడి నిజాయితీ, క్రియేటివ్ ఫ్రీడమ్ వల్లే ఈ కథ ఇంత గొప్పగా తెరకెక్కిందని సాయికృష్ణ ప్రశంసించారు. ఈ సినిమాలో అఖిల్, తేజస్వినిల నటనతో పాటు వెంకన్న పాత్రలో చైతన్య జొన్నలగడ్డ ఆకట్టుకుంటారని చెప్పారు. ‘లిటిల్ హార్ట్స్’ విజయం తర్వాత తమ అసోసియేషన్‌కు ఈ సినిమా మరో హిట్ ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ‘కనకమహాలక్ష్మి 2’ వెబ్ సిరీస్‌తో పాటు నెలకు ఒక కొత్త సినిమాను స్ట్రీమింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సాయికృష్ణ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు