ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన పలు చిత్రాల్లో మంచి ప్రమోషన్స్ తో అటెన్షన్ ని అందుకున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి కూడా ఒకటి. పూర్తిగా దాదాపు కొత్త నటీనటులు తోనే వచ్చిన ఈ సినిమా ఒక సర్ప్రైజింగ్ హిట్ అని చెప్పాలి. పలువురు నోటెడ్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకోవడం విశేషం.
అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ రియల్ లైఫ్ లవ్ స్టోరీ వరల్డ్ వైడ్ 1.47 కోట్ల గ్రాస్ ని అందుకోవడం విశేషం. ఇది మాత్రం ఒక చిన్న సినిమా నుంచి ఆశ్చర్యకర ఓపెనింగ్స్ నెంబర్ అని చెప్పాలి. ఇక డే 2 కూడా మంచి బుకింగ్స్ ని ఈ సినిమా నమోదు చేస్తుంది. మరి వీకెండ్ కి ఈ సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.
