మళ్లీ తెరుచుకోనున్న రాజుగారి గది తలుపులు.. సీక్వెల్ నెంబర్ 4..!

మళ్లీ తెరుచుకోనున్న రాజుగారి గది తలుపులు.. సీక్వెల్ నెంబర్ 4..!

Published on Oct 2, 2025 12:00 PM IST

‘మిరాయ్’ విజయాన్ని సొంతం చేసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దసరా 2026కి మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది 4 : శ్రీచక్రం’ అనే టైటిల్‌తో ఈ సీక్వెల్ రానుంది.

దసరా సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఎర్రచీరలో ఒక మహిళ గాల్లో తేలుతూ, వెనుక భారీ కాళీదేవి విగ్రహం కనిపించడం ఆసక్తిని పెంచింది. “ఏ డివైన్ హారర్ బిగిన్స్” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా పవిత్రత, భయం, వినోదం కలిపిన మాస్ హారర్-కామెడీగా రూపొందుతోంది.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

తాజా వార్తలు