శంకర వరప్రసాద్ గారి కోసం లెజెండరీ సింగర్

శంకర వరప్రసాద్ గారి కోసం లెజెండరీ సింగర్

Published on Oct 2, 2025 4:30 PM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ నుంచి మెగా అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, గతంలో చిరంజీవికి ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ మరోసారి చిరు కోసం పాట పాడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ప్రోమోను అనిల్ రావిపూడి మార్క్‌లో ఫన్నీగా చేశారు.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు