బాలీవుడ్ లో రాజ్‌కుమార్ రావ్ కి మంచి ఇమేజ్ ఉంది. పైగా నార్త్ లో అత్యంత ప్రతిభావంతులైన నటులలో రాజ్‌కుమార్ రావు కూడా ఒకరు. కాగా రాజ్‌కుమార్ రావ్, పత్రలేఖ జంట తల్లిదండ్రులయ్యారు. పత్రలేఖ పండంటి పాపకు జన్మనిచ్చింది. రాజ్‌కుమార్ రావ్ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘మా 4వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఇది. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి’’ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
రాజ్‌కుమార్ రావ్, పత్రలేఖ జంట పేరెంట్స్ గా మారడంతో ‘తల్లిదండ్రుల క్లబ్‌లోకి స్వాగతం’ అంటూ పలువురు బాలీవుడ్ సినీతారలు వారికి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని రోజుల ప్రేమ ప్రయాణం తర్వాత పెద్దల సమక్షంలో 2021లో ఒక్కటయ్యారు. సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘మాలిక్’, ‘భూల్ చుక్ మాఫ్’ లాంటి చిత్రాలతో రాజ్‌కుమార్ రావ్ ప్రేక్షకుల్ని పలకరించారు. అన్నట్టు రాజ్‌కుమార్ రావు ‘బకాసుర రెస్టారెంట్’ హిందీ రీమేక్‌లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
