‘ఆంధ్ర కింగ్’ పైనే ఆశలు పెట్టుకున్న భాగ్యశ్రీ

అందాల భామ భగ్యశ్రీ బోర్సె గత సంవత్సరం ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ కావడంతో ఆమె డెబ్యూ నిరాశపరిచింది. తర్వాత వచ్చిన రెండో సినిమా ‘కింగ్‌డమ్’ పైనా మంచి ఆశలు పెట్టుకున్నా, ఆ చిత్రం కూడా ఫ్లాప్‌గా మిగిలిపోయింది.

ఇలా వరుసగా రెండు ఫ్లాప్‌లు రావడంతో, భగ్యశ్రీ ‘కాంత’ సినిమాపై ఆశలు పెట్టుకుంది. అయితే, ‘కాంత’ చిత్రానికి ఓపెనింగ్ రెస్పాన్స్ బాగానే ఉంది. కానీ బాక్సాఫీస్ ట్రెండ్స్ మాత్రం బలహీనంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాదిలో ఆమెకు నిజమైన హోప్‌గా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మాత్రమే మిగిలింది.

అయితే, ‘కాంత’కు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, భగ్యశ్రీ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మరి అమ్మడికి ఆంధ్ర కింగ్ తాలూకా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.

Exit mobile version