గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. వారి అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఈ ఈవెంట్‌ను జక్కన్న అండ్ టీమ్ జరిపిన తీరు అద్భుతం. ఇక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ చిత్రం నుండి గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కట్ చేశాడు జక్కన్న. కథలోని డెప్త్ చూపెడుతూ వారణాసి ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఇక ఈ సినిమా కథ ఖండాలతో పాటు కాలాలను కలుపుతూ నడిచే విధంగా ఉండబోతుందని అర్థమవుతోంది. అయితే, ఈ గ్లింప్స్ వీడియోలో త్రేతాయుగం నాటి సన్నివేశం కూడా ఒకటి కనిపించింది. అందులో రామ-రావణ యుద్ధంలో రాముడిని వానరసేన ఎత్తుకుని యుద్ధం చేయిస్తున్న సీన్ మాత్రం గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
ఇలాంటి ఆలోచన కేవలం జక్కన్నకు మాత్రమే వస్తుందని టాలీవుడ్ సినీ ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రుద్ర అనే పాత్రలో తాండవం చేసేందుకు మహేష్ బాబు సిద్ధమవుతున్నాడు.
