సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన గ్రాఫికల్ మానియా ‘కొచ్చాడియాన్’ సినిమా ఆడియో లాంచ్ మార్చి 9న తమిళనాడులో జరగనుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన తమిళ్ ట్రాక్ లిస్టు ని రిలీజ్ చేసారు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఏమిటంటే రజినీ కాంత్ భార్య శ్రీమతి లత రజినీకాంత్ ఈ మూవీలో ఓ పాట పాడారు. ఆ పాట పేరు ‘మనపెన్నిన్ సాతియం’.
ఎఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాని తెలుగులో విక్రమ సింహా’గా రిలీజ్ చేస్తున్నారు. మార్చి 10న తెలుగులో ఆడియోని రిలీజ్ చేయనున్నారు. సినిమాని మాత్రం మొత్తం 6 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సౌందర్య అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఇరోస్ ఇంటర్నేషనల్ – మీడియా వన్ బ్యానర్ వారు కలిసి నిర్మించారు.