సమీక్ష : కూలీ – మెప్పించే యాక్షన్ థ్రిల్లర్

Coolie Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 14, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్
జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లెస్సీ, పూజా హెగ్డే (పాటలో ప్రత్యేక పాత్ర), అమీర్ ఖాన్ (అతిథి పాత్ర) తదితరులు.

దర్శకుడు : లోకేష్ కనగరాజ్
నిర్మాత : కళానిధి మారన్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున కలయికలో వచ్చిన సినిమా కూలీ. బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని హైప్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

దేవా (రజనీకాంత్) తన టీమ్ తో అజ్ఞాతంలో బ్రతుకుతూ ఉంటాడు. దేవా ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ (సత్యరాజ్) చనిపోతాడు. అయితే, రాజశేఖర్ ది సహజ మరణం కాదు అని, హత్య అని దేవా కనిపెడతాడు. ఇంతకీ, రాజజేఖర్ ను హత్య చేసింది ఎవరు ?, అతన్ని పట్టుకోవడానికి దేవా ఏం చేశాడు ?, ఈ మధ్యలో సైమన్ (నాగార్జున) పాత్ర ఏమిటి ?, సైమన్ చేసే బిజినెస్ ఏమిటి ?, ఆ బిజినెస్ ను దేవా ఎలా అరికట్టాడు ?, ఈ క్రమంలో దయాల్ (సౌబిన్ షాహిర్) తో దేవా ట్రాక్ ఏమిటి ?, దయాల్ చేసిన క్రైమ్ కి రాజశేఖర్ మరణానికి ఉన్న సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

దేవాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులను మాత్రం ఉర్రూతలూగించారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ సూపర్ స్టార్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. రజినీ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన స్టైలిష్ లుక్స్ తో రజినీకాంత్ చాలా బాగా నటించాడు.

విలన్ గా నటించిన నాగార్జున తన పాత్రలో ఆకట్టుకున్నారు. నాగ్ లుక్ కూడా బాగుంది. ఇక అతిధి పాత్రల్లో నటించిన ఉపేంద్ర, అమీర్ ఖాన్ లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. మరో కీలక పాత్రలో నటించిన సౌబిన్ షాహిర్ కూడా చాలా బాగా నటించాడు. కూతురి పాత్రలో శ్రుతి హాసన్ ఒదిగిపోయింది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ బాగుంది.

జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లెస్సీ, రచితా రామ్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రాసుకున్న యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అలాగే ఆయన క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

దేవా పాత్రను, ఆ పాత్ర తాలూకు గ్రాఫ్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కూలీ కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఈ కూలీ లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన లోకేష్ సెకెండాఫ్ ని మాత్రం మరీ సాగతీశారు.

కథనంలో పూర్తి స్థాయిలో ఉత్సుకతను పెంచటంలో లోకేష్ విఫలమయ్యారు. స్క్రీన్ ప్లేను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. ఓవరాల్ గా ఈ కూలీ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు.

సాంకేతిక విభాగం :

లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా ఈ సినిమాకి న్యాయం చేసినా.. రచయితగా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. నిజానికి ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగుంది. గిరీష్ గంగాధరణ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ప్ర‌తి స‌న్నివేశాన్ని కెమెరామెన్ బాగా విజువ‌లైజ్ చేశారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో కొన్ని సాగతీత సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని కళానిధి మారన్ నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘కూలీ’ అంటూ భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంలో రజినీకాంత్ నటన, నాగార్జున విలనిజం, ఉపేంద్ర, అమీర్ ఖాన్ గెస్ట్
అప్పీరియన్స్ మరియు యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కానీ, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఓవరాల్ గా సూపర్ స్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Exit mobile version