
విజయ్ మరియు కాజల్ ప్రధాన పాత్రలలో విడుదల అయిన “తుపాకి” తమిళ నాడు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ జోరు కొనసాగిస్తుంది. ఈ ఏడాది భారీ విజయం సాదించిన చిత్రాలలో ఇది ఒకటి కానుంది అని తమిళ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ మరియు విజయ్ అభిమానుల సంగతి పక్కన పెడితే ఈ స్పందన చూసిన మురగదాస్ ఆశ్చర్యపోయారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమయిన అభినందన సూపర్ స్టార్ రజినీకాంత్ నుండి వచ్చిందే. మంచి వినోదాత్మక చిత్రాన్ని అందించినందుకు గాను సూపర్ స్టార్ రజిని కాంత్ మురగదాస్ కి కాల్ చేసి అభినందించినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని రెండు సార్లు చూసినట్టు రజినీకాంత్ చెప్పారని మురగదాస్ ట్విట్టర్లో చెప్పారు. ఈ చిత్రంలో విద్యుత్,సత్యాన్ మరియు జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మరో రెండు వారల వరకు కలెక్షన్లు సాదిస్తుందా లేదా అనేది వేచి చూడాలి ఎస్వీఆర్ మీడియా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించగా సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించారు.