తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.
కూలీ చిత్ర రిలీజ్‌కు 100 రోజులు ఉందని.. దీంతో కూలీ తన కౌంట్‌డౌన్ స్టార్ట్ చేస్తున్నాడని ఓ వీడియో రూపొలో ప్రకటించారు. కొన్ని వింటేజ్ షాట్స్‌తో ఈ వీడియో ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, పూజా హెగ్డే తదితరులు కనిపిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Arangam Adhirattume, Whistle Parakkattume!???????? #CoolieIn100Days ⏳#Coolie worldwide from August 14th ????@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees… pic.twitter.com/M8tqGkNIrJ
— Sun Pictures (@sunpictures) May 6, 2025