స్వతహాగా తమిళ హీరో అయిన సూర్య తను నటించిన ‘గజిని’ సినిమా ద్వారా తెలుగు వారికి బాగా చేరువయ్యారు. ఆ తర్వాత సూర్య నటించిన అన్ని సినిమాలు డబ్ చేస్తూ తెలుగులో మంచి మార్కెట్ ను సంపాదించుకున్నారు. ఆయన తాజాగా నటించిన ‘బ్రదర్స్’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం? అని అడిగిన ప్రశ్నకు సూర్య జవాబిస్తూ ‘ నేను అన్ని రకాల సినిమాలు చూస్తాను, అందులో నా మసుకు నచ్చిన కథలనే ఊహించుకొని అలాంటి సినిమాలే తీస్తే ప్రేక్షకులు అంతగా నచ్చకపోవచ్చు. ఈ విషయంలో నాకు సూపర్ స్టార్ రజినీకాంత్ గారు ఒక మాట చెప్పారు. నువ్వు ఒక పెద్ద స్టార్ కానీ అంతకంటే ముందు నువ్వొక నటుడివి. నీకు నచ్చినవి కాకుండా ప్రేక్షకులను ఉత్తేజపరిచేలా మరియు వారిని సంతోష పరిచేలా ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. ఆయన చూపిన బాటలోనే పయనిస్తున్నాను’ అని ఆయన అన్నారు. ఈ సినిమా ఈ రోజు తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదలైంది.