తమిళ లెజెండరీ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ త్వరలో ఓ భారీ చిత్రంతో రాబోతున్నారు. ఈ కాంబినేషన్‌పై తమిళ ప్రేక్షకులే కాదు, అన్ని భాషల సినీ ప్రేమికులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్ నిర్మిస్తుండగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని దర్శకుడు సుందర్ సి డైరెక్ట్ చేయనున్నారు. ఇక ఈ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక సినీ వర్గాల్లో ఇప్పుడు తలైవర్173 సినిమాలో కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పొంగల్ 2027 నాటికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు


