“కూలీ” టీజర్ ఆ స్పెషల్ రోజున?

“కూలీ” టీజర్ ఆ స్పెషల్ రోజున?

Published on Mar 9, 2025 1:00 AM IST

ప్రస్తుతం కోలీవుడ్ సినిమా నుంచి రానున్న పలు అవైటెడ్ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ చిత్రం “కూలీ” కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాలో పాన్ ఇండియా వైడ్ గా స్టార్స్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తుండగా ఈ సినిమా అవైటెడ్ టీజర్ రిలీజ్ పై ఇపుడు లేటెస్ట్ బజ్ తెలుస్తుంది.

దీనితో కూలీ టీజర్ ని మేకర్స్ తమిళ ఆడియెన్స్ కి స్పెషల్ రోజున రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో తమిళ కొత్త సంవత్సరం కానుకగా ఈ ఏప్రిల్ 14 న మేకర్స్ సాలిడ్ టీజర్ కట్ ని వదలనున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా మన తెలుగు నుంచి కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్ట్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు