టాలెంటెడ్ డైరెక్టర్ తో సూపర్ స్టార్

రజనీకాంత్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. అన్నాత్తే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. రజని కాంత్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఓ సూపర్ మాస్ స్క్రిప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. కాగా ఈ చిత్రం తరువాత రజిని టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తో ఓ మూవీ చేనున్నాడట.

కార్తీక్ సుబ్బరాజ్ ఇప్పటికే రజనికి తన స్క్రిప్ట్ వినిపించగా ఆయన పూర్తి సంతృప్తి చెందాడట. అలాగే సినిమా చేద్దాం అని హామీ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి . గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పేట మూవీ వచ్చి మంచి విజయం అందుకుంది.

Exit mobile version