ఆగడు లో తండ్రిగా రాజేంద్ర ప్రసాద్

ఆగడు లో తండ్రిగా రాజేంద్ర ప్రసాద్

Published on Nov 5, 2013 10:45 PM IST

Rajendra-Prasad
‘దూకుడు’ చొత్రంతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా నిలిచిన మహేష్, శ్రీను వైట్ల జోడీ మరోసారి ‘ఆగడు’ రూపంలో మనముందుకు రానుంది. ఈ సినిమా ప్రారంభముహూర్తం ఇదివరకే జరిగింది. డిసెంబర్ నుండి షూటింగ్ మొదలుకానుంది

మునుపటితరం నటుడు రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో మహేష్ బాబుకు తండ్రిగా నటించనున్నాడు. రాజేంద్ర ప్రసాద్ మన శ్రీను వైట్ల మరియు మహేష్ బాబుతో కలిసి నటించడం ఇదే మొదటిసారి. ‘దూకుడు’ సినిమా విజయంలో తండ్రీ కొడుకుల మధ్య అనుభంధం ముఖ్య భూమికను పోషించింది. ఈ సినిమాను హిట్ చేసే ఏ ఒక్క మార్గాన్నీ శ్రీను వైట్ల వదులుకోవడంలేదు. సినిమా ఆద్యంతం కామెడీ మేళవించిన మాస్ ఎంటెర్టైనర్ గా సాగనుందని, హీరో హీరోయిన్ల పాత్రలకు కూడా మాస్ హంగులు అద్దారని సమాచారం

తమన్నా ఈ సినిమాలో హీరోయిన్. థమన్ సంగీత దర్శకుడు. రామ్ ఆచంట, గోపి ఆచంట మరియు అనీల్ సుంకర ఈ భారీ బడ్జెట్ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు

తాజా వార్తలు