పరిశ్రమలో మినిమం గ్యారంటీ హీరో అంటే రాజేంద్రప్రసాద్ అంతేకాకుండా ప్రయోగాలు చెయ్యడంలో తనదయిన శైలి ఎప్పటికీ మానుకోలేదు. అలా చేసిన ఒక ప్రయోగమే గత శుక్రవారం విడుదలయిన “డ్రీం”. ఈ చిత్రం గురించి ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ ఒక ఆసక్తికరమయిన విషయం వెల్లడించారు ఈ చిత్రాన్ని దర్శకుడు మొదట బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కి ఈ కథను చెప్పారంట. తెలుగు మరియు హిందీలో తెరకెక్కించాలని దర్శకుడి నిర్ణయం అని తెలిసిన అమితాబ్ తెలుగులో ఈ చిత్రాన్ని ఎవరితో తీస్తున్నావ్ అని అడిగితే రాజేంద్ర ప్రసాద్ అని దర్శకుడు చెప్పారంట. ముందు అతనితో చెయ్యి తరువాత నేను చేస్తాను అని చెప్పారట. రాజేంద్ర ప్రసాద్ అంటే కామెడి చిత్రాలే అనుకున్నాను ఇటువంటి ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తారని అనుకోలేదు అని అమితాబ్ అన్నారట. అమితాబ్ గతంలో ఇలాంటి ఒక పాత్రనే “బ్లాక్” చిత్రంలో చేశారు. ఇక్కడ కిక్ అవ్వని ఈ చిత్రాన్ని అమితాబ్ చేస్తారో లేదో చూడాలి మరి.
నాకన్నా ముందు డ్రీం కథను అమితాబ్ బచ్చన్ విన్నారట – రాజేంద్ర ప్రసాద్
నాకన్నా ముందు డ్రీం కథను అమితాబ్ బచ్చన్ విన్నారట – రాజేంద్ర ప్రసాద్
Published on Oct 29, 2012 11:47 PM IST
సంబంధిత సమాచారం
- వరల్డ్ వైడ్ ‘లిటిల్ హార్ట్స్’ 4 రోజుల వసూళ్లు!
- బిగ్ బాస్ 9 తెలుగు: మొదటి ఎలిమినేషన్.. డేంజర్ జోన్ లో ఆమె
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- ‘విజయ్ సేతుపతి’ కోసం పూరి స్పెషల్ సీక్వెన్స్ !
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- “ఓజి” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్!?
- సంక్రాంతి బరిలో శర్వా.. రిస్క్ తీసుకుంటాడా..?
- అప్పుడు ‘హనుమాన్’.. ఇప్పుడు ‘మిరాయ్’..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆసియా కప్ 2025: షెడ్యూల్, టీమ్లు, మ్యాచ్ సమయాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- పోల్ : ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు..?
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!
- వీడియో : ఆంధ్ర కింగ్ తాలూకా – పప్పీ షేమ్ సాంగ్ (రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్స్)