త్వరలో రానున్న రాజశేఖర్ – వర్మల ‘పట్ట పగలు’

Rajashekar
టాలీవుడ్ లో రాజశేఖర్ కి యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలు చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తన సినిమాలో వైవిధ్యం మరియు వివాదాస్పదం కూడా చూపగలిగిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వీరిద్దరి కలయికలో సినిమా అంటేనే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అది కూడా ఓ హర్రర్ సినిమా అంటే అందరికీ పెద్ద షాక్ అనే చెప్పాలి.

విషయంలోకి వెళితే రాజశేఖర్ – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘పట్ట పగలు’. ఈ హర్రర్ మూవీని చాలా తక్కువ టైంలో ఎవరికీ తెలియకుండా షూటింగ్ ని పూర్తి చేసేసారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకూఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రాజశేఖర్ నటన సూపర్బ్ గా ఉందని అంటున్నారు.

Exit mobile version