‘యాంగ్రీ యంగ్ మాన్’ రాజశేఖర్ మరో తమిళ సినిమా రీమేక్ ను అంగీకరించాడని సమాచారం. ఒక పల్లెటూరిలో విద్యా వ్యవస్థను మార్చలనుకున్న ఒక ఉపాధ్యాయుడు ఎలాంటి కష్టాలను ఎదుర్కున్నాడు అనేది చిత్ర కధ. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చెయ్యలేదు. ఈ సినిమా తమిళంలో ఘనవిజయం సాదించిన ‘సత్తై’ కు రీమేక్. తమిళంలో సముద్రఖని ప్రధాన పాత్ర పోషించగా ఆ పాత్రను ఇక్కడ రాజశేఖర్ భర్తీ చెయ్యనున్నాడు. అక్కడ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అన్బజ్హగన్ ఇక్కడ కుడా తియ్యనున్నాడు . మిగిలిన తారల వివరాలు ఇంకా ఖరారు కావాల్సివుంది. ప్రస్తుతం రాజశేఖర్ కెరీర్ వరుస ఫ్లాపులతో డల్ గా సాగుతుంది కనుక ఈ సందేశాత్మక ‘సత్తై’ అతనికి ఏ మాత్రం సహాయపడుతుందో చూడాలి