హిందీలో పాట పాడిన సూపర్ స్టార్

Rajani-kanth
స్టైల్ కి, పంచ్ డైలాగ్స్ కి ఫేమస్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్క సౌత్ ఇండియాలోనే కాకుండా ఇండియా మొత్తం మీద అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇప్పటివరకూ నటనకే పరిమితమైన రజనీకాంత్ సింగర్ గా మారి ఓ పాటని పాడారు, అది కూడా హిందీలో పాడడం విశేషం. ప్రస్తుతం రజనీకాంత్ తన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ‘కొచ్చాడియాన్'(తెలుగులో విక్రమ సింహ) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఎ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో రజనీకాంత్ విశ్వసించే నమ్మకాలను తీసుకొని ఇర్షాద్ కమిల్ ఓ పాటని రాశారు. ఆ పాటని రజనీకాంత్ గారే పాడితే బాగుంటుందని బావించిన రెహమాన్ ఎంతో పట్టుబట్టి ఆయనచేతే పాడించారు. రజనీకాంత్ కి వీరాభిమాని అయిన ఎ ఆర్ రెహమాన్ రజనీకాంత్ తో పాట పాడడంతో చాలా సంతోషంగా ఉన్నారు. దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం సెకండాఫ్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version