అనుకున్న టైం కంటే ముందే పూర్తి చేసిన రాజమౌళి

rajamouli

ఎస్ఎస్ రాజమౌళి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయన చివరి సినిమా ‘ఈగ’ తో తెలుగు సినిమా పేరుని నలు దిశలా చాటి చెప్పాడు. కానీ ఆయనపై విమర్శలు కురిపించే వారు రాజమౌళి సినిమా చేయడానికి చాలా టైం తీసుకుంటారని అంటుంటారు. కానీ అయన తీసిన సినిమా బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ తో తను తీసుకున్న టైంకి, బడ్జెట్ కి పూర్తి న్యాయం చేస్తారు.

ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే ఆయన సినిమాని చాలా వేగంగా తీసే పనిలో ఉన్నారు. ఈ రోజు ట్విట్టర్ లో ఉన్న తన ఫాలోవర్స్ కి అనుకున్న టైంలో రెండు రోజులు ఉండగానే షెడ్యూల్ పూర్తి చేసామని తెలిపారు. ఈ వార్త ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ‘ నా కెరీర్లో మొట్ట మొదటిసారి ఒక సీన్ ని అనుకున్న టైం కంటే ముందే పూర్తి చేసాను. ముందుగా ఇందుకోసం 5 రోజులు అనుకున్నాం కానీ అన రోజుల్లోనే సినిమాని పూర్తి చేసామని’ రాజమౌళి ట్వీట్ చేసాడు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – రానా దగ్గుబాటి అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ పీరియాడిక్ అడ్వెంచర్ మూవీలో అనుష్క హీరోయిన్ గా కనిపించనుంది. ఆర్కా మీడియా బ్యానర్ వారు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version