రాజమౌళి ఆలోచనంతా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎలా పూర్తి చేయాలనే. ఆయన ప్రణాళిక మొత్తం కరోనా వైరస్ నాశనం చేసింది. 2020చివరికి గ్రాండ్ అవుట్ ఫుట్ తో ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేసి సంక్రాంతి బరిలో దిగాలని ఆయన ప్లాన్ చేశారు . అందుకే ఆయన 2021 జనవరి 8గా విడుదల తేదీ ప్రకటించారు. లాక్ డౌన్ కారణంగా నాలుగు నెలలుగా మూవీ షూటింగ్ ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు మొదలవుతుంది అనేది రాజమౌళి కూడా క్లారిటీ లేదు. నటులు, సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి మూవీ చేయలేం. దీనితో తక్కువ టైం లో మిగిలన 30 శాతం షూటింగ్ పూర్తి చేయాలని రాజమౌళి బావిస్తున్నారు.
ఇందు కోసం ఆయన ఆర్ ఆర్ ఆర్ లో కొన్ని పాటలు తగ్గించే ఆలోచనలో ఉన్నారట. టాప్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్న ఈ మూవీలో అన్నీ కలిపి పదిపాటల వరకు ప్లాన్ చేశారట రాజమౌళి. అందులో ఓ మూడు పాటలు సుద్దాల అశోక్ తేజ రాసినట్లు తెలిపారు. కాగా కథలో కీలకం కానీ సాంగ్స్ చిత్రీకరణ చేయడకూడదని, వాటిని తన స్క్రిప్ట్ నుండి తీసివేయాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ చక్కర్లు కొడుతోంది.