‘ఆలియా’ కోసం ప్రేమ సన్నివేశాలు పెంచారు !

‘ఆలియా’ కోసం ప్రేమ సన్నివేశాలు పెంచారు !

Published on Mar 18, 2020 6:09 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన నటిస్తోన్న తెలిసిందే. ఆమెకు సంబంధించిన సీన్స్ ను రాజమౌళి ఇప్పటికే షూట్ చేశారు. అయితే ఆమె పాత్ర నిడివిని రెండు సీన్స్ వరకూ పెంచారట. గతంలోనే సీన్స్ ను పెంచబోతున్నట్లు వార్తలు వచ్చాయి. సెకెండ్ హాఫ్ లో ఆలియా అండ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చే కొన్ని ప్రేమ సన్నివేశాల లెంగ్త్ ను పెంచనున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో.. రామ్ చరణ్ అల్లూరి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటిస్తోంది. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు