భీం విషయంలో చెక్కు చెదరని జక్కన.!

భీం విషయంలో చెక్కు చెదరని జక్కన.!

Published on Nov 1, 2020 12:58 PM IST

తెలుగు సినిమా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా మారు మోగించిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. తన అద్భుత చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టి జక్కన ఇండియా లోనే టాప్ దర్శకునిగా మారారు. అయితే రాజమౌళి తీస్తున్న సినిమాలకు గాను ఎప్పటి నుంచో ఏదొక వివాదాలు వస్తూనే ఉంటున్నాయి. అలా ఇటీవలే తాను తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుధిరం”కు కూడా అంతకు మించే వివాదం ఎదురైంది.

ఈ చిత్రంలో స్వాతంత్ర సమరయోధుడు గొండు బెబ్బులి కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి టీజర్ రావడంతో దాని వచ్చిన రెస్పాన్స్ ఒక సంచలనంగా నిలిచింది. అలాగే అదే టీజర్ లో తారక్ ముస్లిం వేషధారణకు సంబంధించి కూడా పెను ధుమారమే రేగింది. దీనితో రాజమౌళిపై విమర్శలు చెలరేగాయి కానీ జక్కన మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదు.

అలాగే ఇటీవలే ఈ ఇస్యూ పొలిటికల్ గా కూడా రాజమౌళి పై సంచలనం రేపింది. అయినప్పటికీ జక్కన మాత్రం మౌనం గానే ఉన్నారు. అది చాలదా తాను ఎందుకు భీం ను ఎందుకు అలా చూపించారో అన్నది. అయినా చరిత్రను చూపించడంలో రాజమౌళికి ఉన్న ఆసక్తే మరో స్థాయిలో ఉంటుంది. అలాంటప్పుడు తాను తప్పుగా చూపిస్తారు అని సినిమాలో ఏముందో కూడా తెలియకుండా ముందే అంచనా వెయ్యడం పునరాలోచన చేసుకోవాల్సిన అంశం.

తాజా వార్తలు