రాజమౌళిని ఓ ప్రముఖ మీడియా ఇటీవల ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ లో ఆయన ప్రస్తుత ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ మరియు డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం గురించి కొన్ని విశేషాలు చెప్పారు. అలాగే తన నెక్స్ట్ మూవీ మహేష్ తో ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఐతే ఎన్టీఆర్, చరణ్ మరియు ప్రభాస్ గురించి చెప్పమని అడిగినప్పుడు ఆయన ప్రభాస్ గురించి కొంచెం మనస్ఫూర్తిగా మాట్లాడారు. ప్రభాస్ నాకు చాల ఆప్తుడు అలాగే క్లోజ్ పర్సన్ అని రాజమౌళి చెప్పారు.
రాజమౌళి ఇప్పటివరకు 11 సినిమాలు చేస్తే వాటిలో ఆరు సినిమాలు ఎన్టీఆర్, ప్రభాస్ లతో రాజమౌళి చేయడం జరిగింది. అంటే 50 శాతానికి పైగా సినిమాలు ఈ ఇద్దరు హీరోలతోనే చేశాడు. ఈ ఇద్దరు హీరోల గురించి చెప్పేటప్పుడు ఎన్టీఆర్ ని మంచి నటుడు అని చెప్పిన రాజమౌళి, ప్రభాస్ నాకు చాలా దగ్గర వ్యక్తి అని చెప్పారు. ఐతే వీరిద్దరి గురించి పైకి కనిపించే లోపాలు కూడా రాజమౌళి చెప్పడం విశేషం.