రాజమౌళి ఇచ్చే ఫీస్ట్ మాములుగా ఉండదా?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం”. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ఈ భారీ పీరియాడిక్ వండర్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం తారక్ అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. ఇప్పటి వరకు తారకు కు సంబంధించి ఒక్క అధికారిక ఫస్ట్ లుక్ కానీ ఒక్క టీజర్ కానీ రాకపోవడంతో తారక్ అభిమానులు తమ ఎమోషన్స్ ను పంటి కింద బిగించి ఉంచారు.

అయితే దర్శకుడు రాజమౌళికి కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో తాను కూడా కాస్త నిస్సహాయ స్థితిలోనే ఉన్నారు. పైగా ఇతర స్టార్ హీరోల అప్డేట్లు కూడా వరుస పెట్టి వస్తుండడంతో తారక్ ఫ్యాన్స్ మరింత డీలా పడ్డారు. అయితే వారందరికీ రాజమౌళి ఇన్నాళ్ల నిరీక్షణకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కూడా మాములుగా ఉండదని చెప్పాలి.

అప్డేట్ రావడానికి కాస్త ఆలస్యం అయినా తారక్ ను ఎలా చూడాలనుకుంటున్నారో తన అభిమానిగా సన్నిహితునిగా బాగా తెలుసు. సో ఇపుడు జక్కన్న మీద చిరు కోపంగా ఉన్న తారక్ అభిమానులు అందరికీ రాజమౌళి ఇవ్వబోయే ఫీస్ట్ మాత్రం వారి ఇన్నాళ్ల నిరీక్షణను ఒక్క సెకండ్ లో తుడిపేసే రేంజ్ లో ప్లాన్ చేసినా ఆశ్చర్యం లేదని చెప్పాలి. కాకపోతే వారు ఆ సరైన సమయం వరకు ఆగాల్సిందే.

Exit mobile version