కార్తికేయ ట్రైలర్ ను ప్రశంసించిన రాజమౌళి

కార్తికేయ ట్రైలర్ ను ప్రశంసించిన రాజమౌళి

Published on Dec 11, 2013 10:10 PM IST

Rajamouli
సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘కార్తికేయ’ సినిమా మొదటి ట్రైలర్ కు ప్రేక్షకాదరణ లభించిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఆ ట్రైలర్ ప్రశంసల కిరీటంలో మరో కలికీతురాయి చేరింది. ఆ రత్నం వేరెవరో కాదు జక్కన్న ఎస్.ఎస్ రాజమౌళి

ఈ స్టార్ డైరెక్టర్ ట్విట్టర్ లో ఈ ట్రైలర్ గురించి విశ్లేషిస్తూ “ఈ ట్రైలర్ లో విజువల్స్ చాలా బాగున్నాయి… సినిమా గురించి ఎదురుచూస్తున్నా. ‘కార్తికేయ’ బృందానికి ఆల్ ది బెస్ట్” అని తెలిపాడు

ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకుడు. శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. నిఖిల్, స్వాతి మరోసారి జంటగా నటిస్తున్నారు. రాజమౌళి ట్వీట్ కు నిఖిల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు

తాజా వార్తలు