రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ లో ఉంది. ఇప్పటివరకూ షూట్ చేసిన సీన్స్ ను ఎడిటర్ తమ్మిరాజు తన ఇంటిలోని ఎడిటింగ్ షూట్ లోనే ఎడిట్ చేశారట. అవుట్ ఫుట్ విషయంలో రాజమౌళి పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక మే 20న తారక్ బర్త్ డే రోజున తారక్ పాత్ర మీద జక్కన్న ఎలాంటి వీడియోను రిలీజ్ చేయనున్నాడు ? దర్శక ధీరుడు డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నాడు ఇలా గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తయిందట. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ సర్ ప్రైజ్ ఇవ్వటం కోసం రాజమౌళి లాక్ డౌన్ లో కూడా బాగానే కష్టపడుతున్నాడు.
కాగా మెయిన్ గా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. ఈ సినిమాకు రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. అయితే సినిమాలో డైలాగ్ లు చాలా బాగుంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.