మళ్ళీ బుల్లి తెర మెగాఫోన్ పట్టిన రాజమౌళి

మళ్ళీ బుల్లి తెర మెగాఫోన్ పట్టిన రాజమౌళి

Published on Jul 26, 2012 5:40 PM IST


తమ చిత్రాల విడుదల టైములో ఆ చిత్ర హీరోలు, హీరోయిన్లు, దర్శకులు మరియు మిగిలిన చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం బుల్లి తెర పై కనిపిస్తుంటారు అది మామూలు విషయమే. కానీ మన టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఏకంగా సీరియల్ లోనే నటించేశారు. ఈ టీవీ లో ప్రతి రోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే చంద్రముఖి అనే సీరియల్ లో ఈ రోజు ప్రసారం కానున్న 1500 ఎపిసోడ్ లో రాజమౌళి కనిపించనున్నారు. అలా కనిపించడమే కాకుండా ఈ ఎపిసోడ్ కి ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. ఇది విన్న చాలా మంది రాజమౌళి ఎందుకు ఇలా చేస్తున్నారు? అనే అనుమానం రావొచ్చు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’ చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ వారు ఈ సీరియల్ ని నిర్మిస్తున్నారు. అందువల్ల వారు అడగగానే రాజమౌళి కాదనలేక చేశారు. మొత్తానికి తన సినిమాలో అందరికీ ఇలా నటించాలి, అలా నటించండి అని చెప్పే రాజమౌళి నటనను బుల్లి తెరపై చూసే అవకాశం వచ్చింది.

తాజా వార్తలు