ఆ విషయంలో ఎన్టీఆర్, బన్నీ కూడా రాజమౌళి తరువాతే.

ఇది సోషల్ మీడియా యుగం, వయసుతో సంబంధం లేకుండా అందరూ వాడే మాధ్యమం. అందుకే స్టార్ హీరోలు ఎప్పుడూ తమ ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ తన సినిమాలకు సంబందించిన అలాగే వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఇక ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మాధ్యమాల్లో వారికి వుండే ఫాలోవర్స్ ని బట్టి ఆ హీరో స్టామినా అంచనా వేస్తూ ఉంటారు. ఈ విషయంలో టాలీవుడ్ లో అందరికంటే టాప్ లో మహేష్ కొనసాగుతున్నాడు. ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 9 మిలియన్స్ కి చేరింది. కాగా స్టార్ హీరోలకు మించి పాపులారిలిటీ ఉన్న రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలకు మించిన ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగి ఉండడం విశేషం.

రాజమౌళి ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 4.7 మిలియన్స్ గా ఉంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ గా కొనసాగుతున్న ఎన్టీఆర్, బన్నీ, పవన్ కళ్యాణ్ కి సైతం ఇంత మంది ఫాలోవర్స్ లేరు. ఎన్టీఆర్ ని ట్విట్టర్ లో 3.5 మిలియన్స్ ఫాలో అవుతూ ఉండగా బన్నీ మరియు పవన్ లను 3.8 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. ఇక ప్రభాస్, రామ్ చరణ్ వంటి వారు ట్విట్టర్ ఖాతాలను కలిగిలేరు. బాహుబలి తరువాత దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి టాప్ స్టార్స్ కి మించిన ట్విట్టర్ ఫాలోయర్స్ ని కలిగివున్నాడు.

Exit mobile version