రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా షూటింగ్ కేరళలో షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ చేరుకుంది. ప్రభాస్, అనుష్క, రానా ప్రధానపాత్రధారులుగా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కుతుంది.
కేరళలో అతిరాపల్లి జలపాతాల దగ్గర ఈ సినిమాలో షూట్ చేసిన కొన్నిముఖ్య సన్నివేశాలు, ఒక యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కించాడు. ఈ ఔట్ పుట్ చూసిన జక్కన్న చాలా బాగుందని,బృందమంతా మనసుపెట్టి పనిచేశారని, అనుకున్న సమయానికి షూటింగ్ ముగించారని తెలిపాడు. ఈ బృందం రెండువారాల విరామం తరువాత ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించనుంది.
తన కెరీర్ లోనే చాలా కష్టమైన యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించనున్నానాని దర్శకుడే తెలిపాడు. గత ఆరునెలలుగా 2000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్లు ఈ షెడ్యూల్ కోసం కష్టపడుతున్నారు. ఈ షెడ్యూల్ రెండు నెలలు పాటూ సాగనుంది. ఇధి రాజమౌళికి అతని బృందానికే ఛాలెంజ్ గా నిలవనుంది.
ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ ద్వారా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె రాఘవేంద్రరావు సమర్పకుడు. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకుడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. 2015లో ఈ సినిమా విడుదలకావచ్చు.