రాజమౌళిని టెన్షన్ పెడుతున్న లాక్ డౌన్..!

రాజమౌళిని టెన్షన్ పెడుతున్న లాక్ డౌన్..!

Published on Apr 26, 2020 3:00 AM IST

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ మొదలు పెట్టి ఏడాది దాటిపోయింది. ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లు షూటింగ్ లో గాయాల పాలు కావడం వలన షూటింగ్ సరిగా జరగలేదు. దీనికి కారణంగా మూవీ విడుదల వాయిదా పడడం జరిగింది. ఇక షూటింగ్ సజావుగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో కరోనా లాక్ డౌన్ కారణంగా మళ్ళీ షూటింగ్ కి బ్రేక్ పడింది.

ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ విడుదల 2020 జులై నుండి 2021 జనవరికి వాయిదా పడింది. లాక్ డౌన్ ఎత్తివేయడానికి మరియి మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది. దీనితో మళ్ళీ మూవీ విడుదల వాయిదా పడుతుందని రాజమౌళి టెన్షన్ పడుతున్నారట. అంత కంతకు మూవీ విడుదల వాయిదా పడడం వలన ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ పెరిగిపోతుందని సమాచారం. ఇక ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుందా, చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు