లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లేకపోవడంతో ఇంటికే పరిమితం అవుతున్నాడు రాజమౌళి. ఈ ఖాళీ సమయంలో తన వద్దకు వచ్చిన కొన్ని మీడియా సంస్థలతో ఆయన ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలలో ఆర్ ఆర్ ఆర్ గురించి విశేషాలతో పాటు, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలు కూడా ఆయన చర్చించారు. కాగా ఈ ఏడాది ఆస్కార్ గెలుచుకున్న కొరియన్ మూవీ పారాసైట్ పై అభిప్రాయం చెప్పడమనగా… రాజమౌళి ఆ సినిమాలో అంత విషయం ఏమిలేదనిపించింది. సగం చూసే సరికి నాకు నిద్ర వచ్చింది అని తన ఒపీనియన్ బయటపెట్టారు.
ఐతే వరల్డ్ సినిమా అవార్డ్స్ లో అత్యున్నతమైనదిగా భావించే ఆస్కార్ గెలుకున్న మూవీ గురించి అంత చులకనగా మాట్లాడం ఏమిటని వారు రాజమౌళిని తప్పుబడుతున్నారు. అనేక రకాల మీమ్స్ తో ఆయన్ని ఆడుకుంటున్నారు. ప్రతి విషయంపై చాల డిప్లొమాటిక్ మాట్లాడే రాజమౌళి ఈ సారి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురవుతున్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇదే అభిప్రాయాన్ని చాల మంది వ్యక్త పరచడం జరిగింది.