ఆర్ ఆర్ ఆర్ టీం తో రాజమౌళి కీలక మీటింగ్

లాక్ డౌన్ వలన బాగా ఇబ్బంది పడిన చిత్రాలలో ఆర్ ఆర్ ఆర్ ఒకటి. భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరోనా వైరస్ గట్టి షాక్ ఇచ్చింది. ఈ మూవీ షూటింగ్ ఆగిపోవడంతో పాటు షూటింగ్ షెడ్యూల్స్, లొకేషన్స్ అన్నీ మారిపోయాయి. ఆర్ ఆర్ ఆర్ కోసం రాజమౌళి అద్భుతమైన లొకేషన్స్ నార్త్ ఇండియాలో ఎంపిక చేసి ఉంచారు. ఈ వైరస్ రీత్యా అక్కడికి వెళ్లి షూటింగ్ జరపలేని పరిస్థితి ఏర్పడింది.

ఇక హైదరాబాద్ లో ఈ చిత్రం కోసం ఓ భారీ సెట్ ఏర్పాటు చేసి షూటింగ్ కి సన్నధం అవుతున్నారు. భారీ చిత్రం, భారీ క్యాస్టింగ్ కలిగిన మూవీ కావడంతో సెట్ లో మాక్ షూటింగ్ కూడా నిర్వహించారు. ఇక కొద్దిరోజులలో షూటింగ్ మొదలుకానున్న నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ టీం తో రాజమౌళి సమావేశం అయ్యారు. సినిమా బడ్జెట్, రెమ్యూనరేషన్స్ వంటి విషయాలతో పాటు కరోనా వైరస్ నుండి తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి అనేక విషయాలు చర్చించినట్లు తెలుస్తుంది

Exit mobile version