ఆర్య, నయనతార నటించిన రాజా రాణి ఆడియో ప్రసాద్ ఐమాక్స్ లో ఈ నెల 27న విడుదలకానుంది. తమిళంలో విడుదలయిన ఈ సినిమా ఆదే పేరుతో అనువాదించారు. శంకర్ దగ్గర పనిచేసిన అత్లీ ఈ సినిమాకు దర్శకుడు. మురగదాస్ నిర్మాత.
వేరొకరితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నఒక యువజంట చుట్టూ తిరిగేకధ. పెళ్లి దాని వలన కలిగే భాందవ్యాలను వర్ణిస్తూ తమిళంలో సున్నితంగా తీసిన కధ. నయన్, ఆర్య కెరీర్ లో నే పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు మురుగదాస్ తెలుగులో సైతం ఈ వీజయాన్ని రుచి చూడాలని ఆశపడుతున్నాడు
ఈ చిత్రం మొదటి లుక్ ఈ నెలలో విడుదలైంది. మార్చ్ లో ఈ చిత్రం మనముందుకురానుంది