విడుదల తేదీ : నవంబర్ 21, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : రాజ్ తరుణ్, రాశి సింగ్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
దర్శకుడు : రామ్ కడుముల
నిర్మాతలు : మాధవి, ఎంఎస్ఎమ్ రెడ్డి
సంగీత దర్శకుడు : శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్ : ఆదిత్య జవ్వాది
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పాంచ్ మినార్’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
కృష్ణ చైతన్య అలియాస్ కిట్టు(రాజ్ తరుణ్) బిట్‌కాయిన్ స్కామ్‌లో ఐదు లక్షలు పోగొట్టుకుని, ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి క్యాబ్ డ్రైవింగ్ చేస్తుంటాడు. ఒకసారి క్యాబ్ రైడ్‌లో ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లు తమ టార్గెట్‌లను చంపుతారు. కిట్టు ఎలాగోలా తప్పించుకున్నా, ఈ ఘటన కారణంగా ఆ కిల్లర్లు లోకల్ రౌడీ ముర్తి(అజయ్ ఘోష్), అలాగే CI అయ్యర్(నితిన్ ప్రసన్న)తో కలిసి అతన్ని చంపాలని చూస్తుంటారు. మరి వారి నుండి తప్పించుకునేందుకు కిట్టు ఏం చేశాడు? ‘పాంచ్ మినార్’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
రాజ్ తరుణ్ ఈసారి లైట్ కామెడీ రోల్‌ను ఎంచుకోవడం ప్లస్ అని చెప్పాలి. ఈ పాత్రను చాలా ఈజ్‌తో చేశాడు. టెన్స్ మూమెంట్స్‌లో అతని రియాక్షన్స్ బాగున్నాయి. అవసరం ఉన్న చోట్ల ఆయన చేసిన కామెడీ నవ్వించింది.
అజయ్ ఘోష్‌కు మంచి సీరియస్ పాత్ర దక్కింది. తన పాత్రలో ఆయన దాన్ని పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేశారు. బ్రహ్మాజీకి కూడా మంచి పాత్ర పడింది. సుదర్శన్ సినిమాలో నవ్వులు పూయించాడు.
సెకండాఫ్ కథనం చాలా సాఫీగా సాగిందని చెప్పాలి. అందులో సీరియస్ సీన్స్‌లో కామెడీని పండించిన తీరు ఆకట్టుకుంటుంది. రైటింగ్ కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా కథను ఆడియన్స్ ముందే ఊహించగలరు. చాలా సినిమాల్లో ఇలాంటి కథను చూసినట్లు అనిపిస్తుంది. దీంతో కొన్ని చోట్ల నెరేషన్‌లో ఎలాంటి కొత్తదనం కనిపించదు. ఇలాంటి సినిమాకు దర్శకుడు మరికొన్ని ట్విస్ట్ ఉన్న సీన్స్ రాసుకోవాల్సింది.
రాశి సింగ్ పర్ఫార్మె్న్స్ బాగున్నా, ఆమె పాత్రకు చాలా తక్కువ స్కోప్ ఇచ్చారు. బ్రహ్మాజీని కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. వీరి పాత్రలు ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపవు.
ఫస్టాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండాఫ్ బాగున్నా, చాలా సీన్స్ అనవసరంగా కనిపిస్తాయి. కొన్ని కామెడీ సీన్స్ కూడా డల్‌గా సాగుతాయి. ఎమోషనల్ డెప్త్ తగ్గినట్లుగా అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
రమేష్ కడుముల రైటింగ్, టేకింగ్‌లో చాలా సేఫ్ గేమ్ ఆడారని చెప్పాలి. ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా అందరికీ తెలిసిన కథకు ఇంకాస్త కామెడీ టచ్ ఇచ్చి ఆయన ఈ సినిమాను తీశారు. అయితే, కథలో బలం లేకపోవడం, ట్విస్టులు పెద్దగా లేకపోవడం వంటి వాటిపై ఆయన మరింత ఫోకస్ చేసి ఉండాల్సింది. ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. గొరిజాల సుధాకర్ డైలాగులు బాగున్నాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘పాంచ్ మినార్’ ఒక క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా కొంతవరకే మెప్పిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్‌లు, నవ్వులు పూయించే కామెడీ ఆకట్టుకుంటాయి. అయితే, సినిమాలో బలమైన కథ లేకపోవడం, యాక్టర్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం వంటివి మెప్పించవు. ఎలాంటి అంచనాలు, ట్విస్టులు లేకుండా ఓ లైట్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని చూడాలనుకునే వారిని ఈ సినిమా కొంతవరకే మెప్పిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


