కేరళలో బాహుబలి షూటింగ్ కు వరుణుడి అంతరాయం

bahubali-first-look
రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా ప్రస్తుతం కేరళలో లోపలి ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ డిసెంబర్ 3న ముగియనుంది. ఇప్పటివరకూ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగుతున్న ఈ షూటింగ్ కు ఈరోజు వరుణుడి రూపంలో చుక్కెదురయ్యింది. షూటింగ్ అవుట్ డోర్ లో జరగడంవలను ఆపడం తప్ప మరొక మార్గం దొరకలేదు

అనుష్క, రానా ‘రుద్రమదేవి’ షూటింగ్ లో వుండడం వలన ప్రభాస్ తో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాస్త విరామం తరువాత తదుపరి షెడ్యూల్ డిసెంబర్ లో ఏకధాటిగా రెండు నెలలు షూటింగ్ చేయనున్నారు

ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ ద్వారా శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె. రాఘవేంద్ర రావు సమర్పకుడు. ఎం.ఎం కీరవాణి సంగీతదర్శకుడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్

Exit mobile version