ఆది సినిమాలో రాహుల్ రవీంద్రన్ అతిధి పాత్ర

Rahul-Ravindran-new-movie

అందాల రాక్షసి సినిమాలో నటించిన రాహుల్ రవీంద్రన్ త్వరలో ఆది నటిస్తున్న ‘గాలిపటం’ సినిమాలో అతిధిపాత్ర చేయనున్నాడు. మొదటిసారిగా అతిధిపాత్ర చేయనున్న రాహుల్ గతంలో అందాలరాక్షసి, పెళ్లి పుస్తకం, నేనేం చిన్నపిల్లనా? వంటి సినిమాలో నటించాడు

హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లో రాహుల్ పాల్గున్నాడు. తన పాత్రకు చిత్రంలో చాలా ప్రాధాన్యత వుంటుందని, ఈ సినిమాబృందంతో పనిచేయడం తనకిష్టమని తెలిపాడు. నవీన్ దర్శకుడు. సంపత్ నంది నిర్మాత. ఆది సరసన ఎరికా ఫెర్నాండెజ్ నటిస్తుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు

ఆది నటించిన ప్యార్ మైన్ పడిపోయా సినిమా ఈ నెలలో విడుదలకానుంది. రవి చావలి దర్శకుడు. సన్వి హీరోయిన్

Exit mobile version