కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హీరోయిన్లు సంజన గల్రాని, రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. ఇద్దరినీ ఒకే సెల్లో ఉంచారు పోలీసులు. అయితే తాజాగా రాగిణి ద్వివేది జైల్లో జారిపడి నడుము, వెన్నెముకకు దెబ్బలు తగలడంతో బాధపడుతోందట. దీంతో పోలీసులు ఆమెకు కారాగారంలోని ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు.
అయితే కారాగారం ఆసుపత్రి చికిత్సతో తనకు నయం కావడంలేదని, నడుం, వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడుతున్నానని తనకు జైలు బయట ఉండే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని సీసీబీ ప్రత్యేక కోర్టుకు విన్నవించుకున్నారు. అర్జీని స్వీకరించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీసీబీ అధికారులకు అవకాశం కల్పించారు. అయితే ఈ నెల 23 వరకు రాగిణి కస్టడీలోనే ఉండాల్సి ఉంది. రాగిణి, సంజనల విచారణలో వారికి అండర్ వరల్డ్ సంబంధాలు కూడ ఉన్నట్టు అనుమానాలు రేకెత్తాయి. ఇప్పటికే ఒకసారి బెయిల్ రిజెక్ట్ అవడంతో కస్టడీ ముగిసేనాటికి బెయిల్ పొందాలని రాగిణి, సంజన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.