ఒక టీచర్ కన్నా తన శిష్యుడు చాలా గొప్పవాడైతే ఆ టీచర్ ఎలా ఫీలవుతాడు? నిజమైన గురువైతే ఆ క్షణంలో ఆయన పొందే సంతోషానికి అవధులు ఉండవు. ఇదే విషయం మన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి విషయంలో కూడా వర్తిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు మరచిపోలేని బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన రాఘవేంద్ర రావు ఎస్.ఎస్ రాజమౌళికి ‘స్టూడెంట్ నెం.1’ సినిమా చాన్స్ ఇచ్చి దర్శకుడిగా పరిచయమయ్యాడు.
అదే రాఘవేంద్ర రావు ఇప్పుడు రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాలని అనుకుంటున్నారు.! మీ అందరికీ ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగించినా ఇదే విషయాన్ని ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పారు కాబట్టి నమ్మే తీరాలి.
” డైరెక్టర్ రాఘవేంద్ర రావుకి రాజమౌళి చెప్పిన ‘బాహుబలి’ కథ పిచ్చ పిచ్చగా నచ్చేసింది. దాంతో ఆయన రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాలనుకున్నాడు. అలా చేరి రాజమౌళి చెప్పిన షాట్స్ ఎలా తీస్తాడో చూసి నేను నేర్చుకోవాలనుకుంటున్నాడని’ శోభు యార్లగడ్డ ట్వీట్ చేసాడు.
ఇది రాఘవేంద్ర రావు గారు, రాజమౌళి గారు గర్వంగా, సంతోషంగా చెప్పుకునే విషయం.