రాఘవేంద్రరావు గారు నిజమైన పెర్ఫెక్షనిష్ట్ : మధుబాల

Madhubala

‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాతో మునుపటి తరం నటి మధుబాల తన కెరియర్ ను మరోసారి ప్రారంభించి మళ్ళీ వార్తలలో నిలిచింది.
దశాబ్ద కాలం క్రితం బాగా బిజీ నటీమణి అయిన ఈమెను తాను నటించిన సినిమాలలో దర్శకుల గురించి అడగగా తెలుగు సినిమాల ఖ్యాతిని పెంచిన దర్శకుడు రాఘవేంద్రరావు గారి సినిమాలో ఒక సంఘటనను గుర్తుచేసుకుంది.

“అల్లరి ప్రియుడు” సినిమా చిత్రీకరణ సమయంలో ఒక సీన్ చేస్తూ యాక్షన్ చెప్పి రాఘవేంద్రరావు గారు కెమెరా నుండి చూసి నేను అలసిపోయానని చెప్పి ప్యాక్ అప్ చెప్పారు.
నిజానికి ఆ ముందురోజు నేను సరిగ్గా నిద్రపోలేదు. దాన్ని సైతం ఆయన గ్రహించారంటే కళ మీధ ఆయనకున్న పట్టును, తపనను తెలియజేస్తుందని తెలిపింది

Exit mobile version