అజయ్ దేవగన్ తో రాఘవ లారెన్స్

Raghava-Lawrance-and-Ajay-D
బాలీవుడ్ లో దర్శకుడిగా రాఘవ లారెన్స్ మొదటి సినిమాకు సర్వం సన్నద్ధమైంది. గతకొన్నేళ్లుగా ఇక్కడ సూపర్ హిట్ అయిన ‘కాంచన’ సినిమాను హిందీలో తెరకెక్కించడం కోసం తారల ఎంపిక జరుగుతుంది. ముందుగా సల్మాన్ ఖాన్ పేరు పరిశీలనలోకి తీసుకున్నా ఆఖరికి ఈ ప్రాజెక్టు అజయ్ దేవగన్ ను వరించింది

రాఘవ లారెన్స్, లక్ష్మి రాయ్ ప్రధానపాత్రలలో నటించిన ఈ హర్రర్ కామెడీ లో శరత్ కుమార్ ఒక నపుంసకుడి పాత్రలో ఇరగదీశాడు. ఈ పాత్రను హిందీలో ఎవరు చేస్తారన్నది త్వరలో అధికారికంగా తెలుపుతారు. ఈ సినిమా ఆగష్టు 2014లో మొదలుకానుంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తారు

ప్రస్తుతం ముని మూడవ భాగం తెరకెక్కించే పనిలో రాఘవ లారెన్స్ బిజీగా వున్నాడు. తాప్సీ హీరోయిన్. నిత్యా మీనన్ ఒక ముఖ్యపాత్ర పోషిస్తుంది

Exit mobile version