బాలకృష్ణ సినిమాకి ఖరారైన సెకండ్ హీరోయిన్

balakrishna-and-radhika-apte
ఈ రోజు నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఈ సినిమాకి ‘లెజెండ్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని కొద్ది సేపటి క్రితమే తెలిపాము. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ఎంపిక కాగా, కొన్ని రోజులుగా మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. ఈ సస్పెన్స్ కి ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర తెరదించారు. ఈ మూవీ లో బాలయ్య సరసన మరో హీరోయిన్ గా రాధిక ఆప్టే కనిపించనుంది.

రాధిక ఆప్టే గతంలో వర్మ తీసిన ‘రక్త చరిత్ర’, ప్రకాష్ రాజ్ చేసిన ‘ధోని’ సినిమాల్లో కనిపించింది. ఆమె చాలా టాలెంట్ ఉన్న నటి. ‘లెజెండ్’ మూవీ లో కూడా రాధికా ఆప్టే ఒక చాలెంజింగ్ పాత్రలో కనిపించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 2014 మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. వారాహి చలన చిత్ర బ్యానర్ తో కలిసి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నారు.

Exit mobile version