పూజా రోల్ రివీల్ చేసిన “రాధే శ్యామ్” టీం..ఇవి గమనించారా?

పూజా రోల్ రివీల్ చేసిన “రాధే శ్యామ్” టీం..ఇవి గమనించారా?

Published on Oct 13, 2020 10:21 AM IST

ఇప్పుడు డార్లింగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్”. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మంచి అంచనాలను నెలకొల్పుకున్నా ఈ పీరియాడిక్ ప్యూర్ లవ్ స్టోరీ కోసం ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ లోపలే షూట్ ను పునః ప్రారంభం చేసిన చిత్ర యూనిట్ నేడు పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అప్డేట్ ను చిత్ర నిర్మాణ సంస్థ రివీల్ చేశారు. ఈ చిత్రంలో పూజా “ప్రేరణ” గా కనిపించనున్నట్టుగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేసారు.

వింటేజ్ లుక్ లో పూజా చాలా ప్లెసెంట్ గా ఇందులో కనిపిస్తుంది. జస్ట్ ఈ పోస్టర్ తోనే అప్పటి మాయాజాలంలోకి దర్శకుడు తీసుకెళ్లడం ఖాయం అని చెప్పాలి. అయితే ఇంకా కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ పోస్టర్ లో పూజా ఒక జర్నీలో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఎవరితోనో మాట్లాడుతుంది.

ఆ ఎదురుగా ఉన్నది ప్రభాసే అన్నట్టుగా చూపిస్తున్నారు అలాగే ఈ ప్రయాణం కూడా ఇటలీ లోనే సాగుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం పూజా బర్త్ డే కు ఆమె ఫ్యాన్స్ కు మరియు ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ను చిత్ర యూనిట్ ఇచ్చారని చెప్పాలి. మరి ప్రభాస్ పుట్టినరోజులు ఎలాంటి బహుమతి ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు