“రాధే శ్యామ్” విజువల్ ట్రీట్ లో బిజీ!

“రాధే శ్యామ్” విజువల్ ట్రీట్ లో బిజీ!

Published on Nov 20, 2020 11:02 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. ఈ మధ్య మంచి అప్డేట్స్ తో మరిన్ని అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ క్లైమాక్స్ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ షూట్ కు సంబంధించి గత కొన్నాళ్లుగా మంచి బజ్ వినిపిస్తుంది.

భారీ బడ్జెట్ ను కూడా దీనికి కేటాయించారు. ఇక ఇప్పుడు టాక్ ప్రకారం అయితే అద్భుతమైన విజువల్స్ తో చేస్తున్నారట. అలాగే ఈ సీక్వెన్స్ విజువల్ ట్రీట్ గా మంచి క్వాలిటీతో చేస్తున్నారు. మేకర్స్ కూడా క్లైమాక్స్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు. మరి రాధే శ్యామ్ యూనిట్ ఈ విజువల్ వండర్ ను ఎలా చూపిస్తారో చూడాలి. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ మేకర్స్ వారి భారీ బడ్జెట్ తోనిర్మిస్తున్నారు.

తాజా వార్తలు