శరవేగంగా సాగుతున్న రేసుగుర్రం రీ-రికార్డింగ్

Race-Gurram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన రేసు గుర్రం చిత్రం భారీ అంచనాల నడుమ ఏప్రిల్ లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. శృతి హసన్ హీరోయిన్ గా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి, డా. వెంకటేశ్వర రావు జంటగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇప్పటికే మంచి రెస్పాన్స్ పొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రి-రికార్డింగ్ పనుల్లో సంగీత దర్శకుడు తమన్ బిజీగా ఉన్నారు. సినిమా మొదటి అర్దభాగానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమన్ పూర్తి చేయగా, రెండవ అర్ద భాగానికి సంబంధించిన పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కిక్ శ్యామ్ ప్రధాన పాత్ర పోషించారు. శ్యామ్, అల్లు అర్జున్ లు సోదరులుగా కనిపించనున్న ఈ చిత్రంలో, వారి మధ్య సాగే తీవ్రమైన పోటీ నేపద్యంలో కథ కొనసాగనుంది.

సలోని మరియు రవి కిషన్ లు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో ప్రధాన భూమిక పోషించారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version