హీరో, హీరొయిన్లపై ఈ రోజు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించుకుని, కాస్త విరామం తరువాత జనవరి 5నుండి ఆఖరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్న రేస్ గుర్రం షూటింగ్ జోరుగా సాగుతుంది. అల్లు అర్జున్, శృతిహాసన్ ప్రధాన తారాగణం
ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో భోజ్ పూరి నటుడు రవి కిషన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. సలోని రెండో నాయిక. నల్లమలపు బుజ్జి నిర్మాణంలో, సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ లో, థమన్ స్వరాలతో ఈ సినిమా రుపదిద్దుకుంటుంది. 2014లో ఈ సినిమా మనముందుకు వస్తుంది
అంతేకాక అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వస్తున్న రెండో సినిమా జనవరి, ఫిబ్రవరిలలో మొదలుకానుంది. వీరి కలయికలో వచ్చిన ‘జులాయి’ అల్లు అర్జున్ కెరీర్ లోనే పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసినదే