విడుదలైన రేస్ గుర్రం మొదటి లుక్ టీజర్

race-gurram
రేస్ గుర్రం గా మనముందుకు రాబోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి టీజర్ ఈరోజు సురేందర్ రెడ్డి జన్మదిన కానుకగా విడుదలైంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ ప్రధాన హీరోయిన్ కాగా సలోని రెండో నాయిక పాత్ర పోషిస్తుంది

రెండు పాటల మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “అల్లు అర్జున్ వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం దాదాపు ఒకేలా వుంటుంది. మేమిద్దరం కలిసి ఎప్పట్నించో సినిమా చేద్దామని అనుకుంటున్నాం. స్టైలిష్ స్టార్ నుంచి ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో వుంటాయి. కమర్షియల్ హంగులు తగ్గకుండా ఫ్యామిలీ సెంటిమెంట్ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాం” అని తెలిపారు

థమన్ సంగీత దర్శకుడు. నల్లమలపు బుజ్జి నిర్మాత. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. ఫెబ్రవరి లో ఈ సినిమా విడుదలకావచ్చు

రేస్ గుర్రం మొదటి లుక్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version